Saturday, 18 April 2026 08:57:52 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలిలో హోటల్ యజమాని దారుణ హత్య

పక్క పక్క ఇళ్లలో ఉండే వారి మధ్య రహదారి వివాదం

Date : 03 May 2024 11:56 PM Views : 940

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని దారుణ హత్య కు గురయ్యాడు. రహదారి విషయమై హోటల్ పక్కనే ఉండే వ్యక్తితో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టి తన పరువు తీసాడని కోపం పెంచుకున్న పక్కింటి వ్యక్తి హోటల్ యజమానిని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు... కొండాపూర్ వైట్ ఫీల్డ్ లో కుటుంబంతో నివాసం ఉండే చల్లూరి శ్రీనివాస్(54) తన కుమారుడు కేశవ్ వినయ్ తో కలిసి గచ్చిబౌలి అంజయ్యనగర్ లో సిఎస్ డిలైట్ ఇన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ హోటల్ వెనుక వైపు ఇంట్లో ఓ గదిని అద్దెకు తీసుకొని స్టోర్ రూమ్ గా వాడుకుంటున్నారు.

Also Read : నానక్ రాంగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

కాగా ఈ రూమ్ కు వెళ్లే దారి విషయంలో పక్క ఇంట్లో ఉండే మహేందర్(35)తో గత సంవత్సరం క్రితం శ్రీనివాస్ కు గొడవ జరిగింది. ఈ విషయమై స్థానిక బస్తీ పెద్దల మద్య పంచాయతీ పెట్టగా, మహేందర్ తీరును బస్తీ పెద్దలు మందలించారు. దీంతో స్థానికుల ముందు తన పరువు పోయిందని మనస్థాపానికి గురైన మహేందర్.. శ్రీనివాస్ మీద కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేతిలో ఇనుప రాడ్డుతో హోటల్ కు వచ్చిన మహేందర్ ఒక్కసారిగా శ్రీనివాస్ తలపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ను అతని కుమారుడు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందాడు. ఈమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :