Wednesday, 22 April 2026 07:12:53 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

డిజిటల్​ అరెస్ట్​ పేరుతో రూ.1.38 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు

ఇద్దరిని అరెస్ట్​ చేసిన సైబర్​ క్రైమ్​ పోలీసులు

Date : 22 February 2025 05:15 AM Views : 879

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : "మీ బ్యాంక్​ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్​ జరిగింది... మిమ్మల్ని డిజిటల్​ అరెస్ట్​ చేస్తున్నామని భయపెట్టి ఓ 82 ఏళ్ల రిటైర్డ్​ ఇంజనీర్​ నుంచి 1.38 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. వృద్ధుడి పిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు ఇద్దరు వ్యక్తులను  అరెస్ట్​ చేశారు. సైబర్​ క్రైమ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రిటైర్డ్​ ఇంజనీర్​(82)కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్​బిఐ ప్రతినిధి అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ బ్యాంక్​ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్​ జరిగిందని, మీపై కేసు నమోదయ్యిందని భయపెట్టాడు. మీతో ముంబై సైబర్​ క్రైమ్​ అఫీసర్​ మాట్లాడుతాడంటూ వాట్సప్​ కాల్​లో మరో వ్యక్తితో మాట్లాడించాడు.

Also Read : మూడు రోజుల పోలీసు కస్టడీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్

సదరు వ్యక్తి వృద్ధుడితో.. మీ బ్యాంక్​ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్​ జరిగిందని, మీ అధార్​ వివరాలు ఇవ్వాలని, మీ బ్యాంక్​ అకౌంట్లను చెక్​ చేస్తామని చెప్పడంతో, భయపడిపోయిన వృద్ధుడు తన అధార్​ కార్డు వివరాలను వారికి చెప్పాడు. ఆ తర్వాత వారి బెదిరింపులకు భయపడిన వృద్ధుడు వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లకు 1.38 కోట్ల రూపాయలు ట్రాన్స్​ఫర్​ చేశాడు. తరువాత సన్నిహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి రాగా, మోసపోయినట్లు గుర్తించిన రిటైర్డ్​ ఇంజనీర్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన శంకర్​ గణేష్​(46), సహచరుడు ఎలంచెజియన్​ సత్యవేల్​లను అరెస్ట్​ చేశారు. శంకర్​ గణేష్​ తన అనుచరుడితో కలిసి 10శాతం కమిషన్​ తీసుకొని సైబర్​ నేరగాళ్లకు   బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  సచిన్​, జెస్మిన్​ మోండల్​​, ముత్తుకుమార్​, సలీమ్​ అనే వ్యక్తులు అఫీసర్లుగా నటిస్తూ డిజిటల్​ అరెస్ట్​ పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసి తమ అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :