Wednesday, 29 July 2026 07:55:35 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు అరెస్ట్

మాదాపూర్ లో 1000 గజాలు కబ్జా చేసి డబ్బులు డిమాండ్..

Date : 06 March 2024 11:51 PM Views : 1207

Ekaburu - క్రైమ్ / రంగారెడ్డి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ లో 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి డబ్బులు డిమాండ్ చేసిన శ్రీనివాస యాదవ్, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వేనెంబర్లు 4పి, 5పి, 6పీ లలో ఉన్న ప్లాట్ నెంబర్ 61, 61ఏలలో 500 గజాలు చొప్పున మొత్తం 1000 గజాలను బాధిత ప్లాట్ ఓనర్ ఓనర్ 1994లో కొనుగోలు చేశాడు. అనంతర కాలంలో ల్యాండ్ ఓనర్ అమెరికాకు వెళ్లాడు

Also Read : ఎల్ఆర్ఎస్ పేరుతో 20వేల కోట్లు దోచుకుంటున్న ప్రభుత్వం : కేటీఆర్

ఈ భూమిపై కన్నేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ మొత్తం 1000 గజాల స్థలాన్ని ఆక్రమించాడు. రాజు క్రికెట్ అకాడమీ పేరుతో ఫెన్సింగ్ వేసాడు. ఆ తర్వాత ప్లాట్లలో చెత్తను వేసి గుడిసెలు వేయించాడు. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమాని తన ప్లాట్లను ఖాళీ చేయాలని స్థల శ్రీనివాసయాదవ్ ను అడగ్గా, బెదిరింపులు దిగాడు, స్థలాన్ని ఖాళీ చేయాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని శ్రీనివాసయాదవ్ ల్యాండ్ ఓనర్ ను బెదిరించాడు. దీంతో ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. మాదాపూర్ పోలీసులు శ్రీనివాసయాదవ్ పై కేసు నమోదు చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు గురువారం శ్రీనివాస యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

బిఆర్ఎస్ కీలక నేత... మాదాపూర్ లో నివాసం ఉండే ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు. బిఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ప్రధాన అనుచరుడు. నిత్యం ఎమ్మెల్యే వెంటే ఉంటూ, ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి లో ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట ఉంటాడు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: