Saturday, 18 April 2026 07:06:43 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలి అమెజాన్ ఐటీ సంస్థలో భారీ మోసం

రూ. 3.2 కోట్ల రూపాయల స్కాం చేసిన ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ అరెస్టు

Date : 21 May 2024 05:20 PM Views : 906

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో వెలుగుచూసిన భారీ స్కాం సంచలంగా మారింది. సంస్థ మాజీ ఉద్యోగులు, ఉద్యోగం వదిలేసిన వారి ఫైనల్ సెటిల్ మెంట్ల పేరుతో సంస్థకు చెందిన 3.2 కోట్ల రూపాయలను బినామీ బ్యాంకు ఖాతాల్లోకి తరలించడం సంచలనంగా మారింది. అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ ఈ స్కాం కు సూత్రధారిగా గుర్తించిన అమెజాన్ నిర్వాహకులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలి అమెజాన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ వెంకటేశ్వర్లు ను అరెస్టు చేశారు.

Also Read : ఆ తేదీనే రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు...

గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఇండియా) సంస్థలో మెట్టు వెంకటేశ్వర్లు సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్-పేరోల్ గా విధులు నిర్వహించాడు. సంస్థను వదిలిపెట్టిన ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్లతో పాటు అమెజాన్ ఉద్యోగుల ఎండ్ టు ఎండ్ పేరోల్ కార్యకలాపాలను వెంకటేశ్వర్లు నిర్వహిస్తుంటాడు. కాగా సంస్థను వదిలిపెట్టిన, మాజీ ఉద్యోగుల కొన్ని లావాదేవీలు ఫైనల్ సెటిల్మెంట్ కాకుండా చాలా రోజులుగా ఉండడం గమనించిన వెంకటేశ్వర్లు భారీ స్కాం కు స్కెచ్ వేశాడు. సంస్థలో పనిచేస్తున్న తన అనుచరులతో కలిసి మాజీ ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలను మార్చి, కొత్త ఖాతాలను సృష్టించాడు. వాటి సహాయంతో సదరు మాజీ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ చేసి, వారికి వెళ్లవలసిన డబ్బును తన బినామీ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ విధంగా అమెజాన్ సంస్థలో గతంలో పనిచేసిన 184మంది మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్ చేసి, 3.22 కోట్ల నగదును తన స్నేహితులు, బందువుల పేరుతో ఉన్న 50 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. 2016 నుంచి 2023 మధ్య కాలంలో వెంకటేశ్వర్లు ఈ స్కాం కు పాల్పడ్డాడు. ఈ మధ్య కాలంలో ఈ విషయాన్ని గమనించిన అమెజాన్ సంస్థ నిర్వాహకులు సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సు వింగ్ కు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకటేశ్వర్లు ను అరెస్టు చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :