Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయని తెలిపింది. నైరుతి గమనం ఈ నెలాఖరు నాటికి కేరళను తాకనుండగా, రాష్ట్రంలోకి మాత్రం వచ్చే నెల మొదటి వారంలో ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పట్టనుంది. రుతుపవనాల రాక కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వెలిబుచ్చారు.
Admin
Ekaburu