Wednesday, 29 July 2026 07:52:03 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఆసియా కప్ ట్రోఫీని తీసుకోని టీమ్ ఇండియా

పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకునేందుకు నిరాకరణ

Date : 29 September 2025 02:37 AM Views : 503

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద అద్భుత విజయం సాధించి విజేతగా నిలిచినా... ట్రోఫీ ని మాత్రం అందుకోలేదు. ఆసియా కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకే ఇష్టపడని టీమ్ ఇండియా విజేత ట్రోపి ని పాకిస్థాన్ మంత్రి చేతుల మీదుగా అందుకునేందుకు నిరాకరించింది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీనితో రాత్రి 12 గంటలకు మ్యాచ్ ముగిసినా బహుమతి ప్రదానోత్సవం అర్థరాత్రి ఒంటిగంట దాటినా ప్రారంభం కాలేదు. చివరికి కుల్దీప్ యాదవ్ మరియు తిలక్ వర్మలు స్టేజి మీద ఉన్న ఇతర ప్రముఖుల నుండి వారి వ్యక్తిగత అవార్డులను అందుకున్నారు.

Also Read : హెచ్ సి యు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా రన్నరప్ చెక్‌ను నఖ్వీ నుండి అందుకున్నాడు. ఆ తర్వాత వేడుక అకస్మాత్తుగా ముగిసింది. ఆసియా కప్ మొత్తం పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా కప్ ప్రెజెంటేషన్ లో పాకిస్థాన్ మంత్రి నుంచి ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించి కోలుకోలేని డబుల్ షాక్ ఇచ్చింది. భారత ఆటగాళ్లు తమ నిర్ణయంతో అభిమానుల మనసులు గెలిచారని పలువురు వ్యాఖ్యానించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: