Wednesday, 22 April 2026 07:11:22 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ప్రాణభయంతో హైటెక్ సిటీ రోడ్లపై జింకల పరుగులు

సెంట్రల్ యూనివర్సిటీ అడవి నుంచి బయటపడుతున్న జింకలు

Date : 05 April 2025 08:22 AM Views : 860

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : బాధ్యత లేని ప్రభుత్వాల గొడ్డలి వేటు కారణంగా గూడు చెదిరిన మూగజీవాలు జనారణ్యంలో ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నాయి.     నిన్నటి వరకు పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా తిరిగిన అడవి జంతువులు నేడు ప్రాణ భయంతో ఇళ్ల మధ్య పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న అడవిలో జెసిబిలు కదం తొక్కి పచ్చటి చెట్లను నెలకూల్చడంతో అందులో ఉన్న జింకలు ప్రాణ భయంతో హైటెక్ సిటీ చుట్టుపక్కల కాలనీలకు చేరుతున్నాయి. ఈ క్రమంలో పలు జింకలు వీధి కుక్కల దాడికి గురై గాయపడుతున్నాయి. కంచ గచ్చిబౌలిలోని సర్వేనెంబర్ 25 లో గల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెట్లను తొలగించి భూమి చదును పనులు చేపట్టడంతో అందులో ఉన్న జింకలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల మధ్యకు వస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిపై అనేక సంవత్సరాల కోర్టు వివాదం గత కొంతకాలం క్రితం పరిష్కారమైన విషయం తెలిసిందే. కోర్టు వివాదం నుంచి బయటపడిన ఈ భూమిని ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించగా, మరోవైపు యూనివర్సిటీ భూమిని వేలం వేయడంపై విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు 400 ఎకరాల భూమిలో ఉన్న జీవవైవిద్యాన్ని కాపాడాలని.. యూనివర్సిటీ భూములను భవిష్యత్తు అవసరాల కోసం యూనివర్సిటీకే అప్పగించాలని విద్యార్థులు పోరాటాలకు దిగారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కాగా అప్పటికే టీజీఐఐసి అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదుల కొద్ది జెసిబిలతో చెట్లను తొలగించి భూమి చదును పనులను చేపట్టింది. దీంతో సదరు భూమిలోని వృక్షాల మధ్య నివాసం ఉంటున్న జింకలు, నెమళ్లు యూనివర్సిటీకి పక్కనే ఉన్న ఇళ్ల వైపు వస్తున్నాయి.

జింకపై కుక్కల దాడి... తాజాగా శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లోకి ఓ జింక రాగా, అక్కడ ఉన్న వీధి కుక్కలు జింక మీద దాడి చేశాయి. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయపడింది. జింక అరుపులతో సంఘటనస్థలికి చేరుకున్న విద్యార్థులు కుక్కలను తరిమివేసి యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది గాయపడిన జింకను చికిత్స నిమిత్తం జూపార్క్ ఆధ్వర్యంలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

గోపన్ పల్లిలో ఇళ్ల మధ్య పరుగులు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి బయటపడిన మరో జింక యూనివర్సిటీకి పక్కనే ఉన్న గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ ఇళ్ల మధ్యకు చేరింది. మొదట ఓ దుకాణంలోకి దూరిన జింక భయంతో తచ్చాడడంతో దుకాణంలోని సామాగ్రి మొత్తం కింద పడిపోయింది. అక్కడి నుంచి బయటపడిన జింకను వీధి కుక్కలు వెంబడించాయి దీంతో ప్రాణభయంతో పరుగులు పెట్టిన జింక రాణి అనే మహిళ ఇంట్లోకి దూరింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ, జూ పార్క్ సిబ్బంది జింకను అతి కష్టం మీద పట్టుకున్నారు. మొదట మత్తుమందు ఇవ్వగా జింక స్పృహకోల్పోకపోవడంతో చివరికి వలవేసి జింకను పట్టుకొని జూపార్కుకు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :