Tuesday, 28 July 2026 06:31:59 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

చుట్టూ గోడ అక్రమం... మధ్యలో గది సక్రమమా...?

ఖాజాగూడ పెద్ద చెరువు ఆక్రమణల అసంపూర్తి కూల్చివేతల వెనుక మర్మమేంటో

Date : 30 May 2024 11:50 PM Views : 1097

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : తాళం వేసి.. గొళ్లెం మరిచిన చందంగా ఉంది శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల వైఖరి. చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత లో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఖాజాగూడ పెద్ద చెరువును శిఖం స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో హడావిడీ చేసిన అధికారులు చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసి మధ్యలో ఉన్న గదిని మాత్రం వదిలేశారు. బుధవారం అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రకటించగా, తెల్లవారే సరికి కబ్జారాయుళ్లు దర్జాగా అదే గదిలో ఉంటూ కబ్జా స్థలాన్ని పొజిషన్ తీసుకున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి కబ్జాదారులు అక్రమ నిర్మాణం చేపట్టారు.

Also Read : తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ బరిలో కొండా విజయ్ కుమార్

ఈ నిర్మాణం మీద పిర్యాదు అందుకున్న శేరిలింగంపల్లి జోనల్ అధికారులు కబ్జారాయుళ్లకు మొదట నోటీసులు జారీ చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఆదేశాలతో బుధవారం అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టారు. కాగా ఇక్కడే అసలు వింత చోటుచేసుకుంది. ఆక్రమించిన స్థలంలో చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ ప్రహరీ గోడను కూల్చి, మధ్యలో ఉన్న గదిని మాత్రం చూసిచూడనట్టు వదిలేయడం వింతగా ఉంది. 24 గంటలు గడవక ముందే కబ్జాదారులు అదే గదిలో ఉంటూ పొజిషన్ తీసుకోవడం విశేషం. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టి, అసలు నిర్మాణాన్ని పక్కనపెట్టి, కొసరు కట్టడాలు కూల్చివేయడం అనుమానాలకు తావిస్తోంది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: