Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : దేశంలో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 2న తేదీన ఎల్వీఏం3 - ఏం5 బాహుబలి రాకెట్ ద్వారా సీఏంఎస్ 03 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరగనుంది. 4400 కేజీల బరువున్న GSAT-7R ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తిచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
Also Read : ఇకపై బ్యాంకు అకౌంట్ కు 'నలుగురు' నామినీలు
Admin
Ekaburu