Wednesday, 22 April 2026 07:11:10 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

దర్జాగా నేషనల్​ హైవే కబ్జా...

ఆర్సీపురంలో జాతీయ రహదారిని ఆక్రమించి షాపుల ఏర్పాటు

Date : 28 September 2024 07:03 AM Views : 1111

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్​ఎంసీ డివిజన్​లో పలువురు వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు ధనార్జనే ధ్యేయంగా జాతీయ రహదారిని ఆక్రమిస్తుంటే.. మరోవైపు నెలవారి మామూళ్లకు అలవాటు పడిన జీహెచ్ఎంపీ అధికారులు నిద్రావస్థ ప్రదర్శిస్తున్నారు. రామచంద్రాపురం జీహెఎంసీ డివిజన్ పరిధిలో శ్రీనిధి స్కూల్​ బిల్డింగ్ ముందు ఓ వ్యాపారస్తుడు ఏకంగా నేషనల్ హైవేని కబ్జా చేసి వ్యాపార సముదాయాన్ని నడిపిస్తున్నాడు. భీరంగూడ హైవే యూ టర్న్​ వద్ద దాదాపు 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి బాహాటంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జాతీయ రహదారికి దూరంగా నిర్మించిన షాపులను అద్దెకు తీసుకున్న సదరు వ్యాపారస్తుడు క్రమంగా రోడ్డుపైకి వచ్చి అక్రమంగా రేకులతో షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. స్థానిక రాజకీయ నాయకుల సపోర్టు ఉందంటూ ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ దౌర్జన్యంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరోవైపు రోడ్డును ఆక్రమించి చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్​ఎంసీ అధికారులు సదరు వ్యాపారస్తుడు నెల నెల ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి అటు వైపు చూడడం మానేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read : సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో బహుళ అంతస్థుల ఇళ్లు

దుకాణాల ఏర్పాటుతో యూటర్న్​ వద్ద రోడ్డు చిన్నదై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానా పోవడం లేదు. షాపులు రోడ్డు మీదకు రాగా, ఈ షాపులకు వచ్చే కస్టమర్లు సైతం రోడ్డు మీదే వాహనాల పార్కింగ్ చేస్తుండడంతో ఈ దారిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి విశాలంగా ఉన్నా.. ఇక్కడ మాత్రం రోజు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రశ్నించిన వారిపై వ్యాపారస్తుడు బెదిరింపులకు దిగుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తానకు రాజకీయ నాయకుల సపోర్ట్​ ఉందని, జీహెచ్​ఎంసీ అధికారులకు నెలవారి మామూళ్లు ఇచ్చి వ్యాపారం చేస్తున్నానని వ్యాపారస్తుడు బాహాటంగానే చెప్తున్నాడని వాపోయారు. నేషనల్​ హైవేని దర్జాగా కబ్జా చేసి షాపులు నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎక్కడైనా, ఎదైనా చేయొచ్చా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జాతీయ రహదారిని ఆక్రమించి షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :