Sunday, 01 March 2026 11:26:47 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

ఐటి కారిడార్ రంగ్ లాల్ కుంటకు పూర్వ వైభవం...

ఐటీ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అందంగా ముస్తాబైన తటాకం

Date : 05 November 2025 08:18 PM Views : 339

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని రంగ్ లాల్ కుంట చెరువు పూర్వ వైభవం సంతరించుకుంది. ఒకప్పుడు స్వచ్చమైన నీటితో, ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేసిన చెరువు మద్యలో అభివృద్ధి దెబ్బకు అనవాళ్లు కోల్పోయి అవసాన దశకు చేరింది. ఈ చెరువు చుట్టూ కార్యకలాపాలు చేవడుతున్న ఐటి సంస్థల చూపు రంగ్లల్ కుంట మీద పడడంతో మరోసారి చెరువుకు పునరుజ్జీనం లభించింది. సామాజిక బాధ్యతలో భాగంగా వర్చుసా సాఫ్ట్వేర్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో చెరువును సుందరంగా తీర్చిదిద్దింది. దీంతో మరోసారి రంగ్ల్ కుంట చెరువు స్వచ్చమైన నీరు, వచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు అభివృద్ధి చేసిన చెరువును బుధవారం తెలంగాణ పిఎసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, టిజిఐఐసి అధికారులు, వర్చుసా సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....

Also Read : ప్రైవేటు హాస్టళ్లలో మకాం వేస్తూ.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తూ..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని నానక్ రాంగూడ సర్వే నెంబరు 106లో 2.28 ఎకరాల విస్తీర్ణంలో రంగ్ లాల్ కుంట చెరువు ఉండగా, ఎఫ్టీఎల్ తో కలిపి చెరువు విస్తీర్ణం 5.36 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో ఈ చెరువు నీటితో చుట్టు ప్రక్కల రైతులు వ్యవసాయం చేశారు. కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఏర్పాటుతో చెరువు చుట్టూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పుట్టుకురావడంతో చెరువు రానురాను కనుమరుగు దశకు చేరింది. చెరువులో కొంతభాగం కబ్జాలకు గురికాగా, రహదారుల కోసం చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేయడం, మురుగు నీరు కలవడం చెరువుకు శావంగా మారింది.

ఒకప్పుడు నిండ నీటితో కళకళలాడిన చెరువు కబ్జాలతో నీటి కుంటగా మారడంతో ఐటి కారీదార్లో ఉన్న వర్చుసా సంస్థ చెరువు పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా సిఎస్ఆర్ నిధులతో మిగిలి ఉన్న చెరువును పూర్తిగా అభివృద్ధి చేసింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరోసారి చెరువు కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాటు చెరువు చుట్టూ కట్టను ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టి ఏడాది పొడవునా స్వచ్ఛమైన వర్షపు నీరు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీని కారణంగా ప్రస్తుతం చెరువులో 24 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండి నిండుకుండలా కనిపిస్తుంది. చెరువు కట్ట చుట్టూ గ్రీనరీ. మొక్కలు ఏర్పాటు చేయడంతో వచ్చదనం పరుచుకోగా, ఇక్కడ 14 స్థానిక జాతుల పక్షులు, సీతాకోకచిలుకలు, జంతువులు అవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాకింగ్ ట్రాక్ చుట్టూ రంగురంగుల పూల మొక్కలతో పాటు స్థానికులు సేదతీరేందుకు గెజిబో, పెరోలా, సీటింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా అభివృద్ధి చేసిన చెరువును బుధవారం ప్రారంభించి స్థానికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐటి కారిడార్లోని ఎత్తైన సాఫ్ట్వేర్ సంస్థల భవనాల మధ్య రంగ్ల్ లాల్ కుంట ప్రస్తుతం సుందరంగా కనిపిస్తుంది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :