Sunday, 13 September 2026 10:52:39 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఇకపై బ్యాంకు అకౌంట్ కు 'నలుగురు' నామినీలు

ఈ నిబంధన ఏ రోజు నుంచి అమలులోకి రానుందో తెలుసా..?

Date : 23 October 2025 11:40 PM Views : 569

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్యాంకింగ్ చట్టాల సవరణలోని పలు నిబంధనలు ఇప్పటికే అమలులోకి రాగా మరో కీలక నిబంధనను బ్యాంకులు త్వరలో అమలులోకి తీసుకువస్తున్నాయి. ఖాతాదారులకు తమ మరణానంతరం ఖాతాల్లో ఉన్న డబ్బు, బ్యాంకు లాకర్లలో ఉన్న సొత్తుకు సంబంధించి ఇప్పటివరకు నామినీగా ఒక్కరినే ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాదారుడు తన అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే నామినీ వివరాలు పొందుపరుస్తుంటార. కాగా కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వారసులు ఎక్కువగా ఉండడంతో పాటు ఖాతాదారుని హక్కుదారులు ఎక్కువగా ఉండి నామినీల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఖాతాదారుడు ఇచ్చిన నామిని అంతకంటే ముందే మరణిస్తే ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం చేపట్టిన బ్యాంకింగ్ చట్టాల సవరణలో నామినీల సంఖ్యను నాలుగు కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు

ఇకపై ఖాతాదారుడు అకౌంట్ ప్రారంభ సమయంలోనే నలుగురు నామినీలను ఎంపిక చేసుకొని వారి వివరాలను ఖాతాలో పొందుపరచవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖాతాదారుడు అకౌంట్ తెరిచే సమయంలోనే నలుగురు నామినీలను పొందుపరచడంతో పాటు నలుగురికి సమాన హక్కును... లేదా ఎవరికి ఎంత శాతం హక్కు అనే వివరాలను.. నలుగురికి ప్రాధాన్యత క్రమంలో హక్కు వివరాలను పొందుపరిచే వెసులుబాటు అమలులోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన బ్యాంకుల్లో అమలులోకి రానున్నట్లు వెల్లడించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: