Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : హైటెక్ మండలం శేరిలింగంపల్లిలో మరో భారీ భూకబ్జా స్కామ్ బయటపడింది. 50 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ భారీ పన్నాగం బయటపడడంతో కబ్జాదారులకు సహకరించిన సబ్ రిజిస్టార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది దీనితోపాటు సదరు సబ్ రిజిస్టర్ మీద పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబపేటలోని సర్వే నంబరు 44లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ ముఠా చాలా కాలంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా ఈ భూమికి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కబ్జా గ్యాంగ్ వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు పూనుకున్నారు. ఈ కబ్జా గ్యాంగ్ కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించడంలో ఓ సబ్ రిజిస్టర్ సహకరించాడు. విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్టార్ ను సస్పెండ్ చేసింది. మక్తా మహబూబ్ పేట భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్టర్-2గా వ్యవహరిస్తున్న కె.మధుసూదన్ రెడ్డిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
Admin
Ekaburu