Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంబించింది. గంటల కొద్ది నిలిచిపోయిన వాహనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినాయక నిమజ్జనం కోసం వచ్చిన వాహనాలతో పాటు వరుస సెలవులతో భక్తులు సైతం భారీ ఎత్తున శ్రీశైలం బాట పట్టారు. దీంతో ఘాట్ రోడ్డు మీద వాహనాలు స్తంభించాయి. హైదరాబాద్ వైపు నుంచి వెళ్లే వాహనాలు దోమల పెంట నుంచి శ్రీశైలం డ్యామ్ బ్రిడ్జి వరకు, డ్యామ్ నుంచి శ్రీశైలం వెళ్లే వైపు మొత్తం రహదారి వాహనాలతో నిండిపోయింది.
Admin
Ekaburu