Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడుల ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతుంది. ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతా ఊహించినట్లుగానే గ్యాస్ సిలిండర్ ధరల మంట ప్రారంభమైంది. హార్ముజ్ జలసంధి నుంచి ఎల్బీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. అర్థరాత్రి నుంచి ఇళ్లకు వాడే సిలెండర్లతో పాటు వాణిజ్య సిలెండర్లపైనా భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అదేవిధంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర కూడా రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడబోతోంది. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు ప్రకటించాయి.
Admin
Ekaburu