Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : నల్లుల బెడద తాళలేక ఓ సంస్థ ఏకంగా కార్యాలయాన్ని మూసివేసింది. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చి నల్లుల నివారణ కోసం కార్యాలయంలో పనులు చేపట్టింది. ఇదేదో సాదాసీదా కంపెనీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రపంచ టేక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు నల్లుల పోటు తప్పలేదు. న్యూయార్క్ మాన్ హట్టన్ చెల్సియాలో గల గూగుల్ క్యాంపస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 19వ తేదీన ఓ మెయిల్ వచ్చింది. ఆఫీసు అధికారిక ఖాతా నుంచి వచ్చిన ఈ మెయిల్ లో.. కార్యాలయంలో నల్లుల బెడద ఉన్న కారణంగా కార్యాలయాన్ని మూసివేస్తున్నామని, ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించాలని సూచించింది. అనంతరం కార్యాలయాన్ని మూసివేసిన అధికారులు నల్లుల నివారణ కోసం చర్యలు చేపట్టారు. నల్లుల కారణంగా ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే తెలియజేయాలని సూచించింది. కాగా ఈ కార్యాలయంలో భారీగా జంతువుల బొమ్మలు ఉన్న కారణంగా నల్లులు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. న్యూయార్క్ గూగుల్ కార్యాలయంలో 2010లో సైతం నల్లులు వ్యాపించగా.. నాడు అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి గూగుల్ సంస్థకు నల్లుల బెడద ఉత్పన్నం కావడం విశేషం.
Also Read : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు
Admin
Ekaburu