Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. విప్రో క్యాంపస్ లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ త్రెడ్ లో వివరాలు షేర్ చేశారు. ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ.. అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్' అని ఒక యూజర్ స్పందించారు.
Admin
Ekaburu