Sunday, 13 September 2026 10:16:25 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం

ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి ఉగ్రవాది ప్రయత్నం

Date : 11 November 2025 04:58 PM Views : 637

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఆ మహమ్మారికి రంగు ఉండదు... రుచి ఉండదు.. మంచినీళ్లలో కలిపితే ఎటువంటి తేడా లేకుండా శుద్ధ జలం సైతం కాలకూట విషంగా మారుతుంది.. ఈ హాలహలం మారుమూల గ్రామాల్లో విరివిగా లభించే ఓ ధాన్యం మొక్క నుంచి ఉత్పత్తి చేయడం విశేషం. దీనినే హైదరాబాద్ కు చెందిన ఓ ఉగ్రవాది ఆయుధంగా మార్చుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి ఆముదం మొక్కతో పథక రచన చేశాడు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో విరివిగా లభించే ఆముదం గింజలనే తన ఆయుదంగా మార్చుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాది. ఆముదం గింజల నుంచి సైనేడ్ కంటే విషపూరితమైన రేసిన్ విషాన్ని తయారుచేసి దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానిక పథక రచన చేశాడు. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఉగ్రవాది డాక్టర్ అమ్మద్ మొహియుద్దీన్ ఉగ్ర ప్రణాళిక తెలిసి పోలీసులు, రక్షణ దళాలే భయాందోళనకు గురయ్యారు. సాధారణ ఆముదం గింజల నుంచి ప్రమాదకర రేసిస్ విషయాన్ని తయారుచేసి ప్రధాన నగరాల్లో సామూహిక విష ప్రయోగానికి మోహియుద్దీన్ పతక రచన చేయడం విస్తు గొలుపుతుంది.

Also Read : జూబ్లీహిల్స్ భూ వివాదంలో రిపోర్టర్ పై కేసు నమోదు

రిసిన్... రిసిన్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఇదీ ఒకటి. రుచి, వాసన ఉండకపోవడం దీని ప్రత్యేకత. ఓ గ్లాసు నీటిలో కలిపినా, మీరు కలలో కూడా అనుమానించలేని మృత్యువు మీ ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. ఇదే రిసిన్ విషాన్ని వేల మందిని చంపేందుకు ఉపయోగించుకోవాలని పతక రచన చేశాడు ఉగ్రవాది అమ్మద్ మొహిద్దిన్. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అమ్మద్ మోసియుద్దీన్ తన వైద్య పరిజ్ఞానాన్ని ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని పథకం వేశాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి, ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విషప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశాడు. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రిసిన్‌ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చేయాలో తెలుసుకొని, తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రిసిన్‌ను తీస్తున్నాడు. ఒక్కసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే, అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విషప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. ఈ ఉగ్ర కుట్రలో డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతనికి సహచరులు మొహమ్మద్ సుహేల్, ఆజాద్‌లతో పాటు భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి ఏటీఎస్.. కానీ చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా, ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్ (యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్) రూపంలో వచ్చింది. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు... ఛేదించలేని అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్‌లను డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. రిసిన్ విషం తయారీ కోసం ఫ్యాక్టరీ లాంటి సెటప్‌ను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: