Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ లో ఓవైపు ఉప ఎన్నికల హడావిడి నెలకొనగా మరోవైపు భూ వివాదం మంటలు రేపుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా వెలుగు చూసిన ఓ సివిల్ వివాదం రాజకీయరంగు పులుముకోగా, పలువురు అగ్ర నాయకుల అనుచరుల హస్తంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ఇదే కేసులో ఓ రిపోర్టర్ మీద కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. సివిల్ వివాదంలో తలదూర్చి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్, దాడి చేశారనే పిర్యాదుతో బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ ప్రాంతంలో భూ వివాదంలో సునీల్ అహుజా కుమారుడు ఆశిష్ అనే వ్యక్తి తన మీద శ్రీదేవి, బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్, ఓల్డ్ సిటీ గ్యాంగ్ దాడి చేశారని పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ పిర్యాదు మీద స్పందించిన పోలీసులు బిగ్ టీవీ రిపోర్టర్ తో పాటు శ్రీదేవి తదితరుల మీద కేసు నమోదు చేశారు.
Admin
Ekaburu