Wednesday, 29 July 2026 07:51:36 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రివార్డులు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు

Date : 03 April 2024 09:40 PM Views : 949

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గంజాయి వ్యాపారులను అరెస్టు చేయడంతో పాటు గంజాయి స్వాధీనంలో చురుకుగా వ్యవహరించిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి మాదాపూర్ డిసిపి డాక్టర్ జి. వినీత్ రివార్డులు అందజేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో గంజాయి వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి స్థావరాలపై గతకొన్ని రోజుల క్రితం దాడులు చేశారు. కాగా ఈ దాడుల సందర్భంలో గంజాయి వ్యాపారులు తెలివిగా పోలీసులను అడ్డుకునేందుకు, గంజాయిని డ్రైనేజీ కాలువలో పారవేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు.

Also Read : రాములోరి తలంబ్రాలు హోమ్ డెలివరీ : హెచ్ సీయు డీఏం మురళీధర్ రెడ్డి

ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ బి.సాయినాథ్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యలు చాకచక్యంగా వ్యవహరించారు. గంజాయి మిస్సింగ్ కాకుండా చూడడంతో పాటు గంజాయి వ్యాపారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో గంజాయి వ్యాపారులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ సాయినాథ్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యలను బుధవారం మాదాపూర్ డిసిపి వినీత్ అభినందించడంతో పాటు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: