Saturday, 18 April 2026 07:12:05 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

రాములోరి తలంబ్రాలు హోమ్ డెలివరీ : హెచ్ సీయు డీఏం మురళీధర్ రెడ్డి

Date : 03 April 2024 08:29 PM Views : 986

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : భద్రాద్రి రాములోరి తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ సదుపాయం తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తుందని హెచ్ సీయు డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 151 రూపాయలు చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా ఈ పంపిణీ చేస్తామని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు భక్తులకు అందించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని, గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలు హోమ్ డెలివరీ కార్యక్రమానికి టిఎస్ఆర్టిసి శ్రీకారం చుట్టిందని అన్నారు.

Also Read : యుద్ధాన్ని జ‌యించిన భారత అమ్మాయిలు

శ్రీరాముడి తలంబ్రాలు కావలసిన వారు ఈనెల 17వ తేదీ వరకు టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ కౌంటర్లలో రూపాయల 151 రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భక్తులు ఎంతో నియమ, నిష్టలతో ధాన్యాన్ని గోటితో వలిచి కోటి బియ్యం గింజలను సీతారాముల కల్యాణోత్సవానికి తలంబ్రాలుగా సిద్ధం చేస్తారని, కల్యాణోత్సవం అనంతరం భక్తులు ఎంతో పవిత్రంగా ఇంటికి తీసుకెళ్లి భగవంతుని వద్ద నిల్వ ఉంచుతారని అన్నారు. ఈ తలంబ్రాలను పెళ్లిళ్లు మొదలగు శుభకార్యాలలో అక్షింతలుగా వాడితే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకమని అన్నారు. ఎంతో పవిత్రమైన శ్రీ సీతారాముల తలంబ్రాలు కావలసిన భక్తులు టిఎస్ ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజేందర్ రెడ్డిని 96522 67204  9849 567 204 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :