Sunday, 13 September 2026 11:37:35 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఘనంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం ఆందజేసిన విశ్వేశ్వరరెడ్డి

Date : 25 February 2024 10:49 PM Views : 1029

Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ అగ్రనాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసిన విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద గల సంధ్యా గార్డెన్స్ లో నిర్వహించిన విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలకు దాదాపు 20 వేల మంది హాజరు కాగా, అభిమానులు, కార్యకర్తల ఆట పాటల మధ్య సందడిగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం విశ్వేశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చదువుల్లో ఉత్తమంగా రాణించిన పేద విద్యార్ధులకు ఆర్థికసాయం అందజేశారు.

విద్యార్థులు, కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, శేరిలింగంపల్లి బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్, రాజేంద్రనగర్ బిజెపి అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, సామాజికవేత్త సరోజ్ బజాజ్, కొండా కుటుంబ సభ్యులు, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై విశ్వేశ్వరరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీద రూపొందించిన ప్రత్యేక పాటను ఆవిష్కరించడంతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ, సామాజిక జీవితానికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: