Saturday, 12 September 2026 08:40:38 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మాస్టర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన హోప్ ఫౌండేషన్

క్రీడాకారులను ప్రోత్సహించడంలో హోప్ ఫౌండేషన్ ముందుంటుంది : కొండా విజయ్

Date : 02 March 2024 06:20 PM Views : 1147

Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రంగారెడ్డి జిల్లా మాస్టర్లకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. శనివారం చందానగర్ లోని పిజెఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ హోప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, మాస్టర్స్ లో జిల్లాను అగ్రభాగాన నిలుపాలని సూచించారు.

Also Read : ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌లో తిరిగి చేరిన తెలంగాణ‌ రాష్ట్రం

జాతీయ మాస్టర్స్ పోటీల్లో బంగారు పథకాలు సాదించిన జానకి మిత్రా, సుంకర మల్లేశ్వరి, దుర్గా గోపాల కృష్ణన్ లను రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో వివిద విభాగాల్లో పథకాలు సాధించిన 60మంది మాస్టర్స్ క్రీడాకారులను హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించడం జరిగిందని కొండా విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి నూనె సురేందర్, ట్రెజరర్ స్వాతిగౌడ్, చిరంజీవులు, కోచ్ డగ్లస్, జ్యోతి, శివలీల రెడ్డిలతో పాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: