Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడాకాలనీకి చెందిన రంగారెడ్డి కుమార్తె మాణిక్య రెడ్డి కళాశాల ఫీజు కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆర్థిక సహాయం అందజేసింది. మాల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మౌనిక రెడ్డి చదువుల్లో ఉత్తమంగా రాణిస్తుండగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మౌనిక రెడ్డికి గత మూడు సంవత్సరాలు గా కళాశాల ఫీజు కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా ఈ సంవత్సరం కళాశాల ఫీజు కోసం మౌనిక రెడ్డికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ 30 వేల రూపాయలను చందానగర్ లోని హోప్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ జోన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ అందజేశారు.
Also Read : శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
ఈ సందర్భంగా జోన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ క్లభ్ ద్వారా గత 3 సంవత్సరాలుగా మౌనిక రెడ్డికి ఆర్థిక సహయం అందచేస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యాక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. చదువుల్లో ఉత్తమంగా రాణించే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావద్దని, లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఇటువంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహిస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లభ్ అద్యక్షుడు బసిరెడ్డి మధూసుధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి భూషన్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి, మారం వెంకట్, నూకల సందీప్ , మారం ప్రసాద్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu