Friday, 11 September 2026 07:12:10 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

మహిళా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి: కొమిరిశెట్టి సాయిబాబా

Date : 01 August 2024 02:39 PM Views : 1276

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ల మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని మియపూర్ చౌరస్తా వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మియపూర్ జాతీయ రహదారిని దిగ్బందించి ధర్నా నిర్వహించారు. రహదారిపై రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Also Read : సినిమాల్లో అవకాశం కల్పిస్తానని సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ నిండు శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళా ఎమ్మెల్యేల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా, మాజీ మంత్రులుగా, ప్రస్తుత శాసనసభ సభ్యులుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు ఎంతో హుందాగా ప్రవర్తించడంతో పాటు ప్రజలకు ఎంతో సేవచేసారని, అటువంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటి సీఎం లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :