Wednesday, 29 July 2026 07:19:28 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మియాపూర్ సర్వే నంబర్ 44లో ప్రభుత్వ భూమి కబ్జా

ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసీల్దార్ కు జనం కోసం పిర్యాదు

Date : 11 March 2024 05:58 PM Views : 736

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 44లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. కబ్జాదారులు ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ప్రభుత్వ భూమి కబ్జా తతంగాన్ని శేరిలింగంపల్లి తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లిన జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కబ్జాలను అరికట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. మియాపూర్ సర్వే నెంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ, కబ్జాలపై శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 44లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత శేరిలింగంపల్లి రెవెన్యూ కార్యాలయం పై ఉందన్నారు.

Also Read : జెనెసిస్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మియాపూర్ బస్ బాడీకి అనుకోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒకే చోట 2 ఎకరాల విస్తీర్ణంలో కబ్జా చేసి, కాంపౌండ్ వాల్, గదుల నిర్మాణం చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని అన్నారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విద్యుత్ శాఖ గతంలో ఇచ్చిన మీటర్లను వెనక్కు తీసుకువెళ్లిందని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమి కబ్జాపై ఆధారాలతో జనం కోసం పిర్యాదు చేస్తుందని, రెవెన్యూ యంత్రాంగం స్పందించి కబ్జాలను తొలగించడంతో పాటు మరోసారి ఇటువంటి ప్రయత్నం జరుగకుండా కబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: