Sunday, 01 March 2026 11:26:41 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

దొంగల్లా పార్టీలు మారడం కాదు... రాజీనామా చేసి గెలవాలి : రవీందర్ యాదవ్

యువరక్తంతో బిఆర్ఎస్ మెరుపు వేగంతో పుంజుకుంటుంది

Date : 13 July 2024 06:56 PM Views : 3167

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దొంగల్లా పార్టీలు మారడం కాదని, బిఆర్ఎస్ పార్టీతో వచ్చిన తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నాయకుడు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారాస నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు పోయినా వచ్చిన నష్టమేమి లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే వారికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సైతం ఆయా నియోజకవర్గాలోని సొంత పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

నియోజకవర్గాల్లో భారాస నేతలు, ఉద్యమకారులు గతంలో సదరు నాయకుల తీరుతో ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. మెరుపు వేగంతో భారాస పుంజుకుంటుందని, రానున్న అన్ని ఎన్నికల్లో భారాస సత్తా ఎంటో చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలు మారిన వారిని ప్రజా సమస్యలపై నిలదీస్తామని, ఎంతటి వరకైనా పోరాటం కొనసాగిస్తామంటూ రవీందర్ యాదవ్ హెచ్చరించారు. పార్టీలు మారుతున్న వారికి కేసీఆర్, కేటీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కేటీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :