Tuesday, 28 July 2026 04:48:02 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అక్రమాలు

విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సీపీఏం ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కు పిర్యాదు

Date : 25 April 2024 10:04 PM Views : 3763

Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన శేరిలింగంపల్లి సర్కిల్ లో అస్థి పన్ను వసూళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీపీఏం నాయకులు వాపోయారు. కొంతమంది అవినీతి అధికారుల కారణంగా కోట్లాది రూపాయల ప్రాపర్టీ టాక్స్ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఆస్థి పన్ను మదింపు లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఏం శేరిలింగంపల్లి జోన్ కమిటీ సభ్యులు జోనల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.

Also Read : పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలి : కొమిరిశెట్టి సాయిబాబా

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీపీఏం జోన్ కమిటీ కార్యదర్శి చల్లా శోభన్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి సర్కిల్20 పరిధిలో గచ్చిబౌలి డైమండ్ హిల్స్ ప్రధాన రహదారి మీద ఉన్న ఓం మార్బుల్, లార్డ్స్ ఫర్నిచర్, కార్ లాంజ్, హుందాయ్ షోరూం, ఉడిపి హోటల్, హోల్సర్ హోటల్ తదితర వాణిజ్య సముదాయాల ప్రాపర్టీ టాక్స్ మదింపు లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. లార్డ్స్ ఫర్నిచర్ సముదాయం 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, కేవలం 500 చదరపు అడుగుల విస్తీర్ణం కు మాత్రమే పన్ను మదింపు చేశారని అన్నారు.

ఇటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని, దీని కారణంగాప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయని అన్నారు. డైమండ్ హిల్స్ లో ఎటువంటి వాణిజ్య సముదాయానికి అనుమతి లేకపోయినా, భారీ వ్యాపార కేంద్రాలు వెలిశాయని అన్నారు. గచ్చిబౌలి డైమండ్ హిల్స్ లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిర్యాదు చేసిన వారిలో శోభన్ తో పాటు జోన్ కమిటీ సభ్యుడు కె.కృష్ణ ఉన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: