Saturday, 18 April 2026 07:10:14 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మంచినీటి సరఫరా సమస్యలపై తక్షణమే స్పందించాలి : ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం

Date : 03 April 2024 10:10 PM Views : 940

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : వేసవికాలం ప్రారంభంలోనే శేరిలింగంపల్లిలో ప్రజల నుంచి మంచినీటి సరఫరాపై పిర్యాదులు వస్తున్నాయని, ప్రజల సమస్యలపై జలమండలి అధికారులు తక్షణమే స్పందించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే గాంధీ మంచి నీటి సరఫరా వ్యవస్థలో అంతరాయం లేకుండా ప్రజలకు స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే ధ్యేయంగా జలమండలి అధికారులు పని చేయాలని సూచించారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు సురక్షితమైన మంచి నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు మెరుగైన మంచి నీటి సరఫరా అందించాలని, మంచి నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు.

Also Read : రివార్డులు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు

నియోజకవవర్గం పరిధిలోని కొన్ని కాలనీలలో తక్కువ ప్రెజర్ తో నీరు వస్తున్నాయని, మరికొన్ని చోట్ల 4 రోజులు గడిచినా నీరు వదలడం లేదని, కొన్ని కాలనీలలో సరిపడా మంచి నీరు రావడం లేదని ప్రజలు పిర్యాదు చేస్తున్నారని అన్నారు. సరిపడినంత నీటిసరఫరా లేక పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. జలమండలి ట్యాంకర్లు సైతం సరైన సమయానికి రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మంచి నీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు సూచించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :