Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించి భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గతకొన్ని రోజుల క్రితమే మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించాలని జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధికారుల దృష్టికి తెలుకువెళ్లింది. రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులతో పాటు రాష్ట్ర మంత్రుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కానీ అధికారుల్లో చలనం లేకపోగా, కబ్జాదారులు మరింత చెలరేగిపోతున్నారు. తాజాగా మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపడుతున్న భారీ బహుళ అంతస్థుల నిర్మాణం విషయాన్ని జనంకోసం మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.
Also Read : జెఎన్టీయూలో ఈనెల 30,31న ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు
ఈ కబ్జాపై హెచ్ఎండీఏ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహశీల్దార్ లకు శనివారం జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి మాట్లాడుతూ మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న భూమిని హైకోర్టు ప్రభుత్వ భూమిగా తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఈ భూమిపై స్టెటస్ కో తీర్పు ఇచ్చిందన్నారు. హెచ్ఎండీఎ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాపాడడంలో అధికారులు వైఫల్యం చెందారని లోకాయుక్త మెట్టికాయలు వేసినా అధికారులు నిద్రమత్తు వీడడం లేదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతుంటే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని అధికారుల తీరుపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. మియాపూర్ ప్రశాంత్ నగర్ లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
Ekaburu