Saturday, 18 April 2026 07:07:07 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలిలో అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

కార్పొరేటర్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు

Date : 21 August 2024 10:45 PM Views : 1215

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అనే నినాదంతో పార్టీలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను చేరువ చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, డివిజన్ లో తమ పనితీరుకు ఆకర్షితులై నేడు ఎంతోమంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బిజెపిలో చేరుతున్నారని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునియప్ప, శంకర్, రాజు, మానస్, కరుణాకర్, విఠల్ తదితరులు బుధవారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గోపన్ పల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి గంగాధర్ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అతి తక్కువ కాలంలోనే చేసి చూపించిందని అన్నారు. ప్రజా సంక్షేమం,అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదన్నారు. బీజేపీ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, మన్నే రమేష్, రాజు , గోపాల్ ప్రభాకర్, సురేష్, రాజు, నగేష్ ,వెంకట్, మని, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :