Monday, 14 September 2026 12:05:07 AM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

చలో బస్ భవన్ - కొమిరిశెట్టి సాయిబాబా ముందస్తు అరెస్టు

రాయదుర్గం పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు

Date : 09 October 2025 10:49 PM Views : 531

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునివ్వడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను పోలీసులు గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. మొదట హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సాయిబాబాను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయిబాబా అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రేణులు భారీ ఎత్తున రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

Also Read : ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?

ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచడం హేయమన్నారు. ఓవైపు ఉచిత ప్రయాణం అంటూ హామీలు ఇచ్చి, మరోవైపు చార్జీలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించేంతవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, అందుకోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని అన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయిబాబాను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, దారుగుపల్లి నరేష్, రాజు ముదిరాజ్, ఆకుల యాదగిరి, రమేష్ గౌడ్, అనిల్ సింగ్, శామ్లెట్ శ్రీనివాస్, అజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: