Wednesday, 29 July 2026 07:54:15 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామరక్ష:  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లిలో స్వచ్చదనం - పచ్చదనం ను విజయవంతం చేయాలని పిలుపు

Date : 06 August 2024 05:14 AM Views : 1303

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామరక్ష అని, పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం నేటితరం మీద ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డోయెన్స్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సర్కిల్ డెప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, ఏఎంఓహెచ్ నగేష్ నాయక్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ కాలనీలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం  కార్యక్రమం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వ్యర్థాల తొలగింపు, రెండవ రోజు దోమల నివారణ, మూడవ రోజు చెరువుల సంరక్షణ,  నాల్గవ రోజు నాలల క్లినింగ్, ఐదవ రోజు వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని సూచించారు.

Also Read : పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారు : కొల్లూరు లక్ష్మీపురం కాలనీవాసులు

కాలనీల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి, దోమల నిర్వహణకు చర్యలు తీసుంటామని, చెరువులను సంరక్షణ కార్యక్రమలు, నాలల క్లినింగ్, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు చెప్పటి కాలనీ లను సుందర శోభిత వనంలుగా తీర్చిదిదిద్దుతామని అన్నారు. కాలనీల అసోసియేషన్  సభ్యులు, స్థానికులు, సామాజిక వేత్తలు సంఘటితమైతే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఆదర్శవంతమైన, సుందరవనంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలన్నారు. మొక్కలు నాటాడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత సైతం తీసుకోవాలని సూచించారు.  మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఏంసీ  ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, యూబిడీ డైరెక్టర్ అనిల్, మేనేజర్ విక్రమ్ చంద్రతో పాటు నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: