Wednesday, 22 April 2026 05:00:50 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

అన్ని వర్గాలను కలిపే వారధి హిందుత్వం : కొండా విశ్వేశ్వరరెడ్డి

రాయదుర్గం విస్పర్ వ్యాలీ వాసులతో ఆత్మీయ సమావేశం

Date : 17 March 2024 08:01 PM Views : 731

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : హిందుత్వం అనేది ఒక మతం కాదని, దేశంలోని అన్ని వర్గాలను కలిపే ఒక వారధి అని బిజెపి చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని విస్పర్ వ్యాలీలో కాలనీ వాసులతో కొండా విశ్వేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ హిందుత్వం మీద ఎంతోమంది ఎన్నో చెప్తుంటారని, కానీ ఆర్ఎస్ఎస్, విహెచ్ పి వంటి సంస్థలు హిందు ధర్మ సంరక్షణ కోసం పాటుపడుతున్నాయన్నారు. రామమందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల అని, ఆ కలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సాకారం చేశారన్నారు.

Also Read : బీజేపీ హయాంలో నయా భారత్ ఆవిష్కరణ: కొండా విశ్వేశ్వరరెడ్డి

రామమందిర నిర్మాణం కోసం కోట్లాది మంది ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేశారని, కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఈ మహత్తర ఘట్టంలో పాలుపంచుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కేంద్రంలో మరోసారి బిజెపి అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారనేందుకు గత పదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. చేవెళ్లలో బిజెపిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, ప్రధాని మోడీకి కానుకగా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :