Sunday, 01 March 2026 11:25:14 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

చేవెళ్ల గడ్డపై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ నమోదు చేస్తాం: సాయిబాబా

బిఆర్ఎస్ అభ్యర్థి కాసానితో సమావేశమైన గచ్చిబౌలి శ్రేణులు

Date : 21 April 2024 12:29 AM Views : 3029

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ధీమా వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి బిఆర్ఎస్ శ్రేణులు చేవెళ్ల బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో అభ్యర్థి జ్ఞానేశ్వర్ తో పాటు ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం మీద ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోరని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించడం ఖాయమని అన్నారు.

Also Read : తక్కువ ధరకు బంగారమంటూ తోటి ఉద్యోగులకు టోకరా ఇచ్చిన ఐటీ ఉద్యోగి

ముఖ్యమంత్రి గా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేడు ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హామీలను విస్మరించిందన్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారని, కేసీఆర్ పాలనను మరోసారి కోరుకుంటున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీని కట్టబెట్టేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా తో పాటు నీరుడి గణేష్, సత్యనారాయణ, రాజు నాయక్ లతో పాటు డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :