Wednesday, 29 July 2026 06:14:01 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ జెండా : మాజీ కార్పొరేటర్ సాయిబాబా

గచ్చిబౌలి డివిజన్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 27 April 2024 04:19 PM Views : 3801

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటి. రామారావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం గచ్చిబౌలి డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. చావుకు సైతం వెనుకాడకుండా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టారని అన్నారు.

Also Read : శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కండువా వార్

రాష్ట్ర ఏర్పాటు అనంతరం వెనుకబడిన తెలంగాణ ను తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువచ్చారని అన్నారు. రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఐటీ శాఖ మంత్రిగా కెటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపారని, కెటిఆర్ ముందుచూపుతో ఐటీ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఐటీ కేంద్రంగా నిలిచిందని అన్నారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి ని చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: