Saturday, 18 April 2026 07:11:04 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

నానక్ రాంగూడలో పర్యటించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 21 June 2024 08:58 PM Views : 929

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో చేపడుతున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నానక్రాంగూడ గ్రామంలో పాదయాత్ర నిర్వహించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను సమీక్షించారు.

Also Read : రహదారుల మీద బైక్ రేసింగ్ లకు పాల్పడితే జైలుకే

భూగర్భ డ్రైనేజీ, మంచినీటి ఫైప్ లైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపట్టాలని శానిటేషన్ అధికారులకు సూచించారు.  గత మూడున్నర సంవత్సరాల కాలంలోనే గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ది పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రజల మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :