Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలో నకిలీ పట్టాల బాగోతం బయటపడడం సంచలనంగా మారింది గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన జీవో 58 59 పట్టాల నకిలీ వి సృష్టించి అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు నకిలీ పట్టాల ఆసరాగా జిహెచ్ఎంసి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా సదరు స్థలాల్లో భారీ ఎత్తున భవనాలు వెలిశాయి. తాజాగా గచ్చిబౌలి సర్వే నెంబర్ 134, 135, 136 లో ఓ పార్కు స్థలం కబ్జాకు గురికావడంతో జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జీహెచ్ఏంసీ, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన జిహెచ్ఎంసి అధికారులు సదరు పట్టాల ధ్రువీకరణ కోసం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సదురుపట్టాలు తమ రెవెన్యూ కార్యాలయం మంజూరు చేసినవి కావని.. నకిలీ పట్టాలని తేల్చారు. దీంతో నకిలీ పట్టాలతో జిహెచ్ఎంసి భవన నిర్మాణ అనుమతులు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై శనివారం కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ పట్టాల బాగోతంలో మొత్తం నలుగురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.38 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Admin
Ekaburu