Friday, 11 September 2026 07:03:56 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

జీహెచ్ఎంసి మేయర్, కమిషనర్లను కలిసిన ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లిలో నెలకొన్న సమస్యలు అభివృద్ధి పనులపై చర్చ

Date : 08 August 2024 11:43 PM Views : 3560

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : జీహెచ్ఎంసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలిని గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని,  అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతం కావడం దృష్ట్యా అభివృద్ధి పనులను కొనసాగించాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యపై సిబ్బందిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చెయ్యాలని, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల పునరుద్ధరణకై నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఐటీ కారిడార్ లో అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: