Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ఐటి రంగంలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఐటి శాఖమంత్రి కెటి.రామారావుదని తెలంగాణ ఉద్యమకారుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ జన్మదిన వేడుకలను కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, వివేకానందనగర్ కార్పొరేటర్ రోజా రంగారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి కెటిఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
Also Read : శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో భగ్గుమన్న విబేధాలు
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ ఐటి రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన కెటిఆర్ కార్యదక్షత కారణంగా నగరంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. ఐటి రంగంపై తనకు ఉన్న అనుభవంతో నగరంలో ఐటి పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని అన్నారు. ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, నియోజకవర్గం వరిధిలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10ఏళ్ల కాలంలో శేరిలింగంపల్లిలో 9వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు.
పటిష్టమైన కార్యకర్తలు, పార్టీ అభిమానులతో శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు బిఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తంయాదవ్, మిద్దెల మల్లారెడ్డి, రవీందర్ యాదవ్, బిఎస్ఎన్. కిరణ్, భాస్కరరావు, వాల హరీష్ రావు, రాగం జంగయ్యయాదవ్, తిరుమల్లేష్, బాబు మల్లేష్, గణేష్ రెడ్డి, దారుగువల్లి నరేష్, అంజమ్మ, రాజుముదిరాజ్, అశోక యాదవ్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu