Wednesday, 29 July 2026 07:52:19 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బిజెపి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గోపన్ పల్లిలో గచ్చిబౌలి డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జిల సన్నాహక సమావేశం

Date : 31 March 2024 10:21 PM Views : 994

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లిలో డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జిలు, ముఖ్య నాయకుల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సోదరీ అనితా రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం.రవికుమార్ యాదవ్ తో కలిసి గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ఒక్కరోజు ఈ ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. అదే బిజెపి అభ్యర్థి  కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పాటు మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గచ్చిబౌలి డివిజన్ ప్రజలను కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారద్యంలో దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టారని, 10 సంవత్సరాల నుండి దేశం ఆర్థికంగా పటిష్టంగా మారుతుందని అన్నారు.

Also Read : మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం : మాజీ కార్పొరేటర్ సాయిబాబా

అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ మధ్యే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పలు పొరపాట్ల కారణంగా శేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలు అయిందని, మరోసారి అటువంటి తప్పులు జరుగకుండా చూసుకోవాలసిన అవసరం ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ, చదువుకున్న వారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే 45 రోజులు పార్టీకి సమయం కేటాయించి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వసంత్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, డివిజన్, బూత్ అధ్యక్షులు,బూత్ కమిటీ ఇంచార్జిలు, శక్తి కేంద్రల ఇంచార్జిలు,డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: