Saturday, 18 April 2026 07:07:31 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

తెలంగాణ ప్రత్యేకత "గంగా జమునా తెహజీబ్" మరింత పరిఢవిల్లాలి : ఎమ్మెల్యే గాంధీ

Date : 30 March 2024 08:35 PM Views : 919

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో మసీదులో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందులో శనివారం కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినందించదగ్గ విషయం అని, తెలంగాణకు ప్రత్యేకమైన "గంగా జమునా తెహజీబ్" మరింతగా పరిఢవిల్లాలని అన్నారు.

Also Read : హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : స్పెషల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత

రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని ఎమ్మెల్యే గాంధీ అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం, సంస్కారం అలవడుతుందని, తెలంగాణలో రంజాన్ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మానిఫెస్టోలో లేని అంశాలను సైతం ప్రవేశపెట్టి, ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాదిముబారక్  పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలు, మైనారిటీ గురుకుల స్కూల్స్ ప్రారంభం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

పవిత్ర రంజాన్ పండుగను ఎటువంటి వెలితి లేకుండా జరుపుకునేందుకు రంజాన్ తోఫాలను అందజేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :