Tuesday, 28 July 2026 07:16:08 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన గచ్చిబౌలి కార్పొరేటర్

Date : 14 April 2024 10:28 PM Views : 1059

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతిఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని, అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో గల బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలలో ఆదివారం మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకొని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

Also Read : అన్నివర్గాల ఆరాధ్యదైవం బిఆర్.అంబేద్కర్ : కొమిరిశెట్టి సాయిబాబా

అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, అంబేద్కర్ గారు ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నరు. సమాజంలో అణిచివేతకు గురిచేయపడ్డ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలను చేసి వారికి సమాజంలో గుర్తింపు సాధించిపెట్టారు అని, వారి పోరాటాల ఫలితంగానే నేడు దేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అని తెలిపారు. అంబెడ్కర్ జయంతి ఒక కులానికో, మతానికో సంబంధించినది కాదని, ఇది దేశ ప్రజలందరిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం అధ్యక్షులు సంజీవ, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు ,శ్యామ్ యాదవ్, ఇందిరా, నందు, ప్రభాకర్, మన్నే రమేష్, రంగస్వామి, విష్ణు, ప్రవీణ్, దుర్గరామ్ , విజయ్, చిన్న, క్రాంతి, మధు , టింకు, ప్రవీణ్ ,స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: