Saturday, 18 April 2026 07:08:55 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మీదికుంట చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

Date : 11 March 2024 10:36 PM Views : 675

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని మీదికుంట చెరువు సుందరీకరణ పనులకు సోమవారం నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సీడీపీ నిధులతో పాటు ఫౌంటెన్ హెడ్ ది గ్లోబల్ స్కూల్, మాతృశ్రీనగర్ సంక్షేమ సంఘం సహకారంతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సీడీపీ నిధులతో పాటు ఫౌంటెన్ హెడ్ ది గ్లోబల్ స్కూల్ చైర్ పర్సన్ మేఘన ముసునూరి, పాఠశాల విద్యార్థులు, మాతృశ్రీ నగర్ సంక్షేమ సంఘం భాగస్వామ్యంతో చెరువును ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగిందని, చెరువు చుట్టూ ఫెన్సింగ్, చెరువు కట్ట పునరుద్దరణ, డ్రైనేజి నీటి మల్లింపు పనులు చేపట్టామన్నారు. త్వరలోనే చెరువును సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువు అభివృద్ధిలో పాలుపంచుకున్న వారిని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు.

Also Read : కార్పొరేటర్ అనుచరుడినంటూ టిఫిన్ సెంటర్ లో హల్ చల్

పాఠశాల విద్యా బోధనలో భాగంగా చెరువు సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహనా కల్పిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం భాగస్వాములను చేస్తూ మీదికుంట చెరువును అభివృద్ధి చేసిన ఫౌంటెన్ హెడ్ ది గ్లోబల్ స్కూల్ యజమాని మేఘన ముసునూరి కృషి ఎంతో గొప్పదన్నారు. చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు కట్ట పటిష్టం, మురుగు నీటి పైప్ లైన్, అలుగు మరమ్మతు, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. చెరువు సుందరీకరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. శేరిలింగంపల్లిలో ఉన్న చెరువుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌంటెన్ హెడ్ ది గ్లోబల్ స్కూల్ ఫౌండర్ మేఘన ముసునూరి, శ్రీధర్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్, చైతన్య, రాము,కల్పన, సుధాలతో పాటు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, భిక్షపతి ముదిరాజ్, కావూరి అనిల్, రఘునాథ్, సాంబయ్య,మామిడాల రాజు, రాజయ్య, గంట వాసు, విజయ్, రమేష్, సతీష్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, కాలనీ వాసులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :