Wednesday, 29 July 2026 07:54:51 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మియాపూర్ స్కూల్ లో తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

Date : 24 February 2024 07:43 PM Views : 684

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో  సినాప్సిస్ సాప్ట్ వేర్ సంస్థ సౌజన్యంతో Nirman.org ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు అదనపు తరగతి గదులు, సోలార్ వ్యవస్థ, సైన్స్ లాబ్ పరికరాలు, గ్రీన్ బోర్డ్ లను స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ తో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సినాప్సిస్ సంస్థ సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులు చదుకునే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రతిఒక్కరు సినాప్సిస్ సంస్థను ఆదర్శంగా తీసుకొని, తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని సూచించారు.

నాయకులు సైతం తమ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు.  విద్యార్థులు తమకు అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉత్తమంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినాప్సిస్ సంస్థ సైట్ డైరెక్టర్ నరేంద్ర, సీనియర్ మేనేజర్ నర్సింహ, నిర్మాణ్ సంస్థ కో ఆర్డినేటర్ అనురాధ, భార్గవ రామ్, భగవాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధర దేవి , ఉపాధ్యాయులు బాల్ రెడ్డి ,మదన్ మోహన్ సత్యనారాయణరావు, వీణ, గౌసియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, చంద్రిక ప్రసాద్,మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా ,స్వరూప, ముజీబ్, రోషన్, తిమ్మరాజు, శ్రీ శైలం, రామకృష్ణ,గోల్కొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: