Tuesday, 28 July 2026 05:34:47 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్ఎస్ : ఎమ్మెల్యే గాంధీ

చిన్న అంజయ్య నగర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

Date : 02 April 2024 08:10 PM Views : 980

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ముస్లింల సంక్షేమానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో గల మసీదులో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందులో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినదించదగ్గ విషయం అన్నారు. రంజాన్ పండుగ తెలంగాణలో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, తెలంగాణకు ప్రత్యేకమైన "గంగా జమునా తెహజీబ్" మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

Also Read : సర్దార్ సర్వాయి పాపన్నకు గౌడ సంక్షేమ సంఘం ఘన నివాళి

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ముస్లిం ప్రజానీకానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో అండగా నిలిచారని గుర్తుచేశారు. షాదిముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడపిల్లల పెళ్లికి  1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం, మైనారిటీ గురుకుల స్కూల్స్ ప్రారంభం వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పేదింటి ముస్లింలు పండుగను ఎటువంటి వెలితి లేకుండా జరుపుకునేందుకు రంజాన్ తోఫా ను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ యూసఫ్ పాషా, సయ్యద్ నయీమ్, షౌకత్, సద్దాం, సయ్యద్ జహీర్, చందు, రాజు నాయక్, జై సింగ్, అజామ్, జంగీర్ బీ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: