Tuesday, 28 July 2026 07:16:30 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాలి: జనం కోసం

శేరిలింగంపల్లి తహశీల్దార్ ను కలిసిన కసిరెడ్డి భాస్కరరెడ్డి

Date : 28 February 2024 05:24 AM Views : 735

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిని కలిసి కోరారు. అభివృద్ధి పేరుమీద ఒకవైపు... లేక్ బ్రీజ్, లేక్ వ్యూల పేరుమీద మరోవైపు కార్పోరేట్ సంస్థల కుట్రపూరిత విధానాలతో శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్న చెరువులను అన్యాక్రాంతం చేస్తున్నాయని కసిరెడ్డి భాస్కరరెడ్డి తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పేరుమీద చెరువుల్లో నీరులేకుండా చేయడం వల్ల పరిసర ప్రాంతాల బోర్లు ఎండిపోయి వచ్చే ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనం కోసం తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. చెరువుల్లో జీహెచ్ఎంసీ గుడ్డిగా పర్మీషన్ ఇవ్వడాన్ని నిరోధించాలని జనం కోసం తహసీల్దార్ ను కోరింది. నల్లగండ్ల పెద్ద చెరువు కబ్జాలకు పాల్పడుతున్న ఆపర్ణ సంస్థపై చర్యలు తీసికొని, చెరువును కాపాడాలని తహశీల్దార్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని భాస్కర రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి భవిష్యత్ తరాల మనుగడ కోసం చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: