Saturday, 12 September 2026 08:40:04 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది: రామస్వామి యాదవ్

Date : 03 March 2024 07:03 PM Views : 768

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ఎవరికి వారే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ లోని శారదా హైస్కూల్ లో ఆదివారం మజీద్ బండ హోలిస్టిక్ హాస్పటల్ సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, నేత్ర పరీక్షలతో పాటు ఈ.సీ.జీ. మొదలైన పరీక్షలు నిర్వహించారు. జనరల్ ఫీజిషియన్ డాక్టర్ సద్గురు, ఆర్థో డాక్టర్ విశ్వనాథ్ వైద్య సేవలు అందించారు.

Also Read : ప్రభుత్వ భూముల ఆక్రమణపై కలెక్టర్ కు పిర్యాదు చేసిన జనంకోసం

ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మారిన జీవనశైలి, పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా మానవులు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. మానవుడికి ఆరోగ్యమే మహాభాగ్యమని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగా, ధ్యానము, నడక నిత్యజీవితంలో అలవాటు చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బందా నరేంద్రబాబు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు పాలం శ్రీను, హాస్పిటల్ ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: