Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రయాణికుల పడిగాపులు, లగేజీ బ్యాగుల కుప్పలతో హైదరాబాద్ ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. విమానాల రద్దుతో ప్రయాణికులు శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్ పోర్టులో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి దేశ, విదేశాలకు వెళ్ల వలసిన 69 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇతర విమానాల మీద ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రయాణికులతో, సూట్‌కేసుల కుప్పలతో దారుణంగా మారింది. దేశంలోని ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
Also Read : గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్
Admin
Ekaburu