Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : బాల్య విద్యా విధానంలో అంతర్జాతీయ బ్రాండ్ సఫారీ కిడ్ ప్రీస్కూల్ తన డేకేర్ బ్రాంచ్ ను గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో ఏర్పాటు చేసింది. 2005లో సిలికాన్ వ్యాలీలో ప్రారంభమైన సఫారీ కిడ్ అమెరికా, కెనడాతో పాటు భారత్ లో 50 కి పైగా కేంద్రాలతో అంతర్జాతీయంగా పేరు సాధించింది. దేశంలోని టెక్ పార్కుల్లో మొదటి సరిగా నగరంలోని నానక్ రాంగూడలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, సఫారీ కిడ్ గ్రూపు నాయకత్వ బృందం, సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి, టెక్ లీడర్ సాహితీరెడ్డి పాల్గొన్నారు.
Also Read : పార్సిల్ తో ఉడాయించిన ఉబర్ బైక్ రైడర్
ఈ సందర్భంగా సఫారీ కిడ్ ఇండియా ఛైర్మన్ జితేంద్ర కర్సన్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో ఐటీ నిపుణులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, సఫారీ కిడ్ పరిశోధన ఆధారిత, ప్రగతిశీల బోధనా విధానం ఐటీ ఉద్యోగుల కుటుంబాల అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి దేశం అంతటా 10 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన బోధనా పాఠ్య ప్రణాళికలతో చిన్నారుల ప్రారంభ విద్యను ఉజ్వల భవిష్యత్ కు పునాదిగా మార్చడమే సఫారీ కిడ్ విధానమన్నారు.సఫారీ కిడ్ ప్రీస్కూల్ డేకేర్ సమాచారం కోసం www.safarikidindia.com సంప్రదించాలని కోరారు.
Admin
Ekaburu